Reading Time: < 1 minute

IPL Controversy: IPL ఎఫెక్ట్: శ్రీలంక క్రికెట్ బోర్డుపైనే కేసు వేసిన ఆర్సీబీ ప్లేయర్

Caption of Image.

IPL Controversy: ఇండియన్ క్రికెట్ లీగ్ చుట్టు అనేక వివాదాలు చుట్టుముట్టాయి. అవి కేవలం ఆటపరంగానే కాదు, ఇతరత్రా కారణాలతోనూ.. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్లేయర్ ఒకరు తన సొంత క్రికెట్ బోర్డుపైనే ఏకంగా కేసు పెట్టాడు. దీని వెనుక ఉన్న కారణం ఐపీఎల్ తో లింక్ అయి ఉండటంతో ఈ వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. ఇంతకీ శ్రీలంక క్రికెట్ బోర్డుపై కేసు పెట్టిన వేసిన ఆ దేశానికి చెందిన ఆటగాడు ఎవరో ఇప్పుడు వీ6 తెలుగులో తెలుసుకుందాం.. 

ఐపీఎల్ 2026లో పాల్గొనడానికి తనకు NOC ఇవ్వకపోవడంతో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి చెందిన శ్రీలంకన్ పేసర్ నువాన్ తుషార.. ఆ దేశ క్రికెట్ బోర్డు ఉన్నతాధికారులపై ఏకంగా కేసు దాఖలు చేసినట్లు సమాచారం. నిర్దేశించిన ఫిట్‌నెస్ ప్రమాణాలను అందుకోలేకపోవడంతో తుషారకు NOC జారీ చేయలేదు.. కానీ ఇప్పుడు ఐపీఎల్‌లో ఆడేందుకు తనకు పర్మిషన్ ఇవ్వాలని లంక బోర్డును ఆదేశించాలని కోరుతూ ఈ పేసర్ కోర్టుకెక్కాడు. అలాగే తన సెంట్రల్ కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించొద్దని కూడా తుషార క్రికెట్ బోర్డుకు తేల్చి చెప్పారు. 

శ్రీలంకకు చెందిన మీడియా కథనాల ప్రకారం.. తుషార తన కంప్లైంట్ లో శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మీ సిల్వా, కార్యదర్శి బందుల దిస్సనాయకే, కోశాధికారి సుజీవ గొడలియడ్డ, సీఈఓ ఆష్లే డిసిల్వాలను ప్రతివాదులుగా చేర్చాడు. ఏప్రిల్ 9వ తేదీన ఈ కేసు విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది. కొలంబో జిల్లా కోర్టు దీనిని ఇవాళ దర్యాప్తుకు స్వీకరించగా.. క్రికెట్ బోర్డుతో తన ఒప్పందం మార్చి 31వ తేదీతో ముగియాల్సి ఉందని, ఆ ఒప్పందాన్ని తిరిగి పునరుద్ధరించొద్దని, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాను తప్పుకోవాలనుకుంటున్నానని ఇప్పటికే ఈ విషయాన్ని బోర్డుకు తెలియజేసినట్లు తుషారా వెల్లడించాడు. తన కెరీర్‌లో చాలా కాలం పాటు ఫిట్‌నెస్ స్థాయి అలాగే ఉంది.. గతంలో బోర్డు తనకు NOC పొందటానికి ఆటంకం కలిగించారని కూడా తుషారా వాదిస్తున్నట్లు తెలుస్తుంది.  

©️ VIL Media Pvt Ltd.