
హైదరాబాద్: నగరంలో పెరిగిపోయిన దోమల సమస్యను ఎత్తి చూపుతూ ఎల్బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్న నిరసన చేశారు. అసెంబ్లీకి ఆయన దోమ తెర, ఫాగింగ్ యంత్రంతో వచ్చారు. అయితే ఇందుకు అనుమతి లేదని మార్షల్స్ ఆయన్ను అడ్డుకున్నారు. ఆయన వద్ద నుంచి దోమతెర లాక్కునేందుకు యత్నించారు. దీంతో మార్షల్స్‌పై సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగరంలోని దోమల బెడత తట్టుకోలేక ప్రజలు హైదరాబాద్ నుంచి పారిపోతున్నారని వ్యాఖ్యానించారు. దీనివల్ల నగరం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని అన్నారు. దోమల సమస్య నుంచి ప్రజలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.