Reading Time: < 1 minute
Ranbirs Ramayana Vs Rajamoulis Varanasi

దర్శకధీరుడు రాజమౌళి ఏది చేసిన సంచలనమే. ఆయన సినిమా వస్తుందంటే చాలు.. యావత్ ప్రపంచం టాలీవుడ్ వైపు చూస్తోంది. బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ఇండియన్ సినిమాను హాలీవుడ్‌ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న.. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘వారణాసి’ అనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. గ్లోబల్ అడ్వెంచర్‌గా వస్తున్న ఈ సినిమా హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా.. దాదాపు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను రామాయణాన్ని టచ్ చేస్తూ ఊహకందని విధంగా.. విజువల్ వండర్‌గా రూపొందిస్తున్నాడు రాజమౌళి.

Also Read : Vijay Devarakonda : రణబాలి ఫైట్ సీన్ లీక్.. దేవరకొండ విశ్వరూపం!

దీంతో మహేష్ బాబు రాముడి లుక్ ఎలా ఉంటుందా? అని అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. గతంలో వారణాసి వరల్డ్‌ను ఇంట్రడ్యూస్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలో, ఒకే ఒక్క రామాయణ షాట్‌ చూస్తే.. సినిమా ఎలా ఉండబోతుందో కూడా అంచనాలకు అందకుండా ఉంది. రామాయణ ఎపిసోడ్‌కి సంబంధించి ఒక్క షాట్ చాలు అనేలా.. వారణాసి వీడియో గ్లింప్స్ అదిరిపోయింది. అయితే, తాజాగా బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న ‘రామాయణ’ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఇది చూసిన తర్వాత.. వారణాసి రాముడి లుక్ రివీల్ అయితే మాత్రం.. ఇలా ఉండదని అర్థమవుతోంది. రాముడిగా రణ్‌బీర్ కపూర్ లుక్ బాగున్నప్పటికీ.. రాజమౌళి రాముడి ముందు నిలబడడం మాత్రం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే.. శ్రీరాముడి సీన్‌ షూట్ తర్వాత.. ఇన్ని రోజుల కష్టానికి ఈ ఒక్క షాట్ చాలు.. అని అనిపించిందని స్వయంగా మహేష్ బాబునే ఓసారి చెప్పుకొచ్చాడు. కాబట్టి.. లుక్స్ పరంగానే కాదు, విజువల్ పరంగాను వారణాసి టాప్ నాచ్ అనేలా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఎప్పుడైనా సరే.. మహేష్ రాముడు లుక్ రివీల్ అయినప్పుడు మాత్రం, సోషల్ మీడియా తగలబడిపోవడం గ్యారెంటీ.