
నాన్‌వెజ్ ప్రియులు.. మటన్, చికెన్, చేపలు అనగానే లొట్టలేసుకుంటూ మరి తింటారు.. అయితే.. చాలా మంది మాంసాహారం వండేటప్పు మసాలాలు ఎక్కువగా వేసుకుంటారు. మసాలాలు, కారం లేకపోతే వారికి ఆహారం రుచించదు.. కొంతమంది అయితే.. పరిమితికి మంచి మసాలాలు వాడుతుంటారు. అయితే.. తరచుగా ఒక ప్రశ్న తలెత్తుతుంది.. ఎక్కువ మసాలాలు తినడం వల్ల పేగులకు హాని కలుగుతుందా..? అలాంటి ఆహారం ఆరోగ్యానికి కూడా హాని చేస్తుందా? ఎంత మసాలా ఆహారం సరైనది .. ఎవరు దానికి దూరంగా ఉండాలి? ఈ ప్రశ్నలకు నిపుణులు ఏం చెబుతున్నారు.. ఎంత వినియోగించాలి అనే వివరాలను తెలుసుకుందాం..
ఎయిమ్స్ ఢిల్లీలోని గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగానికి చెందిన డాక్టర్ అనన్య గుప్తా వివరించిన ప్రకారం.. మసాలా ఆహారం హానికరం, కానీ అది కేవలం అధిక పరిమాణంలో తీసుకున్నప్పుడు మాత్రమే.. అతిగా తినడం వల్ల పేగుల లోపలి పొర దెబ్బతింటుంది. ఇది తరచుగా మనకు తెలియకుండానే జరుగుతుంది. ప్రారంభంలో, ఇది గుండెల్లో మంట, గ్యాస్, ఎసిడిటీకి కారణమవుతుంది. కానీ ప్రజలు దీనిని నిర్లక్ష్యం చేయడంతో.. ఇది క్రమంగా ఒక పెద్ద సమస్యగా మారుతుంది.
IBS, అల్సర్ల ప్రమాదం..
ప్రతిరోజూ, లేదా వారానికి మూడు నాలుగు రోజులు నాన్ వెజ్ – మసాలా ఆహారం తీసుకునే వారికి కొన్ని సంవత్సరాలలోనే అల్సర్ల నుండి ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) వరకు లక్షణాలు కనిపించవచ్చని డాక్టర్ గుప్తా వివరిస్తున్నారు. ఈ రెండు సమస్యలు పేగు ఆరోగ్యానికి ప్రమాదకరం… మసాలా ఆహారాల వల్ల పేగు లోపలి పొర దెబ్బతినడం వలన అల్సర్లు వస్తాయి. మసాలా ఆహారాలు జీర్ణక్రియకు ఆటంకం కలిగించడం వల్ల IBS వస్తుంది. అయితే, మసాలాను తట్టుకునే సామర్థ్యం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొందరు మసాలా ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసుకోగలిగితే, మరికొందరు కొద్ది మొత్తంలో తిన్నా అసౌకర్యానికి గురవుతారు. అందువల్ల, మీ శరీరంలోని ఈ లక్షణాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
ఈ లక్షణాలు కనిపిస్తే, మసాలా ఆహారం మీకు సరిపడదని అర్థం..
- కడుపు నొప్పి
- సూదులు గుచ్చినట్లు మంట.. ఉబ్బరం.. భారంగా అనిపించడం
- వాంతులు – విరేచనాలు
- కడుపులో మంటగా అనిపించడం
- ఆమ్లత్వం(ఎసిడిటి)
- కడుపు నిండినట్లుగా అనిపించడం
- కడుపు శుభ్రంగా లేకపోవడం
- ఆకలి లేకపోవడం
కారం, మసాలాలు ఉన్న ఆహారాన్ని ఎవరు తినకూడదు?
డాక్టర్ గుప్తా చెప్పిన దాని ప్రకారం.. మసాలా ఆహారం తిన్న తర్వాత మీకు ఈ లక్షణాలు కనిపిస్తే, మసాలా ఆహారాన్ని మానుకోండి లేదా రెండు నెలలకు ఒకసారి మాత్రమే మసాలా తినండి. అయితే, మీకు ఈ సమస్యలు లేకపోతే, మీరు అలాంటి ఆహారాలను మితంగా తినవచ్చు. కానీ, కడుపు సంబంధిత అనారోగ్యాలు ఉన్నవారు ఈ ఆహారానికి దూరంగా ఉండాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..