
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్న హైవోల్టెజ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మొదట ఫీల్డింగ్ తీసుకుంది. హోమ్ గ్రౌండ్‌లో మొదట బౌలింగ్ చేసి ప్రత్యర్థిని కట్టడి చేయాలనే వ్యూహంతో కేకేఆర్ బరిలోకి దిగుతోంది. ఈ సందర్భంగా కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ.. పిచ్‌పై గడ్డి ఉండటం, చుట్టూ వర్షపు వాతావరణం ఉండటంతో మొదట బౌలింగ్ చేయడం కలిసొస్తుందని పేర్కొన్నారు. మంచు (Dew) ప్రభావంపై స్పష్టత లేకపోయినా, 40 ఓవర్ల పాటు పిచ్ ఒకేలా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం.. పతిరానా త్వరలోనే బౌలింగ్ చేస్తాడని ఆశిస్తున్నట్లు రహానే పేర్కొన్నారు.
SRH కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. ఒకవేళ టాస్ గెలిచినా తాము కూడా మొదట బౌలింగ్ చేయాలనుకున్నామని తెలిపారు. అయితే ఇప్పుడు మొదట బ్యాటింగ్ చేయాల్సి రావడంతో, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడి భారీ స్కోరు సాధించడమే లక్ష్యమని చెప్పారు. సన్‌రైజర్స్ జట్టులో ఒక మార్పు జరిగింది. శివాంగ్ కుమార్ జట్టులోకి వచ్చారు.. వికెట్లు తీసే ఆప్షన్లను పెంచుకోవడానికి అతనికి అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. రెగ్యులర్ ప్లేయర్ (పాట్ కమిన్స్/తుషార) త్వరలోనే అందుబాటులోకి వస్తారని ఇషాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్/ వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, డేవిడ్ పేన్
ఇంపాక్ట్ ప్లేయర్స్: సన్‌రైజర్స్ హైదరాబాద్ – హర్షల్ పటేల్, లియామ్ లివింగ్‌స్టోన్, ఎషాన్ మలింగ, స్మరన్ రవిచంద్రన్, సాకిబ్ హుస్సేన్
కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, బ్లెస్సింగ్ ముజారబానీ
ఇంపాక్ట్ ప్లేయర్స్: కోల్‌కతా నైట్ రైడర్స్ – రోవ్‌మన్ పావెల్, ఫిన్ అలెన్, మనీష్ పాండే, తేజస్వి దహియా, సౌరభ్ దూబే
🚨 TOSS 🚨@kkriders won the toss against @sunrisers and will field first
Updates ▶️ https://t.co/iCMFpDudP7#TATAIPL | #KhelBindaas | #KKRvSRH pic.twitter.com/AatcEELPeZ
— IndianPremierLeague (@IPL) April 2, 2026