Reading Time: < 1 minute

రెడ్‌మి నోట్ 15 స్పెషల్ ఎడిషన్ వచ్చేసింది: స్టైలిష్ డిజైన్, అత్యంత స్లిమ్ బాడీతో అదిరిపోయే ఫీచర్లు!

Caption of Image.

షావోమీ ఇండియా ఈరోజు (2 మార్చ్ 2026) రెడ్‌మి నోట్ 15 స్పెషల్ ఎడిషన్ భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. మిడ్-రేంజ్ విభాగంలో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ స్టైలిష్ డిజైన్, అదిరిపోయే డిస్‌ప్లే, పటిష్టమైన మన్నికకు ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యంగా రెడ్‌మి నోట్ 15 సిరీస్‌లోనే మొదటిసారిగా అత్యంత సన్నని బాడీతో పాటు ప్రీమియం లుక్ ఇచ్చే కర్వ్డ్ డిస్‌ప్లే ఇందులో పరిచయం చేశారు. కేవలం లుక్స్ మాత్రమే కాకుండా, మెరుగైన సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌తో మంచి అనుభూతిని అందించేలా షావోమీ ఈ ఫోన్‌ను రూపొందించింది.

ఫీచర్లు
రెడ్‌మి నోట్ 15 స్పెషల్ ఎడిషన్‌లో FHD+ రిజల్యూషన్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది.  3D-కర్వ్ డిజైన్‌తో, 7.35mm  మందం, సుమారు 178 గ్రాముల బరువుతో 3 రంగుల్లో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్ ఇచ్చారు.  దుమ్ము, వాటర్ రిసిస్టెంట్ కోసం IP65, IP66 రేటింగ్‌ ఉంది. షియోమి నాలుగు సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు అందిస్తోంది.

ఇండియాలో దీని ధర 
రెడ్‌మి నోట్ 15 SE    6GB + 128GB    వేరియంట్ MRP ధర రూ.24,999, ప్రత్యేక ధర    రూ.19,999, బ్యాంకు ఆఫర్ ధర రూ.17,999
రెడ్‌మి నోట్ 15 SE    8GB + 128GBవేరియంట్ MRP ధర రూ.25,999, ప్రత్యేక ధర    రూ.21,999, బ్యాంకు ఆఫర్ ధర రూ.19,999
రెడ్‌మి నోట్ 15 SE    8GB + 256GBవేరియంట్ MRP ధర రూ.27,999, ప్రత్యేక ధర    రూ.23,999, బ్యాంకు ఆఫర్ ధర రూ.21,999

 కంపెనీ బ్యాంక్ డిస్కౌంట్లను కూడా అందిస్తోంది, దీనివల్ల వేరియంట్‌ను బట్టి అసలు ధర రూ. 2,000 వరకు తగ్గుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్స్ ఏప్రిల్ 7, 2026 నుండి మొదలవుతాయి.   షియోమి అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనొచ్చు. సెలెక్ట్ చేసిన బ్యాంక్ కార్డులపై నో-కాస్ట్ EMI ఆప్షన్‌ కూడా పొందవచ్చు.
 

©️ VIL Media Pvt Ltd.