
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకం రెండో విడతకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం మిఠాయిపల్లి పర్యటనలో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ పథకంపై స్పష్టతనిచ్చారు. ఈ నెలాఖరులోగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు. ఇప్పటికే మొదటి విడతలో భాగంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయించారు. చాలా వరకు ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తి కావచ్చాయి.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు అందే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని.. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకే మేలు చేకూర్చడమే ప్రజా ప్రభుత్వం ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు. ఏప్రిల్ నెలాఖరులోగా రెండో విడతకు సంబంధించిన మార్గదర్శకాలు, ఎంపిక జాబితాపై అధికారులు కసరత్తు పూర్తి చేయనున్నారు.
Also Read:LayOffs: ఆ ఉద్యోగులకు బిగ్ షాక్.. మరోసారి లేఆఫ్స్ ప్రకటన.. కొంప ముంచుతున్న ఏఐ..
తమ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా, కోటి మంది మహిళలను ‘కోటీశ్వరులుగా’ తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి తెలిపారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ‘ఇంటిగ్రేటెడ్ భూభారతి’ పోర్టల్‌ను ఆవిష్కరించిన ఆయన.. ఇది ప్రజలకు భూమికి సంబంధించిన అన్ని హక్కులను భద్రపరుస్తుందని వివరించారు. భూమి రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడమే ఈ పోర్టల్ ప్రధాన ఉద్దేశం.