
గత దశాబ్ద కాలంలో తెలుగు సినిమా రంగం కీలక పరిణామాలను చూసింది. ఒకప్పుడు కమర్షియల్ సినిమా అంటే ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, ఒక కామెడీ ట్రాక్ తప్పనిసరిగా ఉండాలనే నియమం ఉండేది. ఇది జానర్ ఏదైనా పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాకు టెంప్లేట్‌గా భావించబడేది. అయితే, గత పదేళ్లలో ఈ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా కొత్త తరం దర్శకులు సినిమా ఫార్మాట్‌ను సమూలంగా మార్చేశారు. సినిమా కథకు ఆటంకం అని భావిస్తే పాటలు, యాక్షన్ ఎపిసోడ్స్‌ను పూర్తిగా పక్కన పెడుతున్నారు. కథా ప్రవాహానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సీక్వెల్స్ ట్రెండ్ కూడా పెరిగింది, ఒకే కథను రెండు, మూడు భాగాలుగా తీసి నిర్మాతలకు డబుల్ లాభాలు తెచ్చిపెడుతోంది.