
తెలుగు సినీ పరిశ్రమలో నటీమణులకు అవకాశాలు రావడం ఒక ఎత్తు, స్టార్ ఇమేజ్ సాధించడం మరొక ఎత్తు. స్టార్ ఇమేజ్ ఉన్నప్పుడే నటీమణులు ఎక్కువ కాలం గుర్తుండిపోతారు. అలాగే మంచి పారితోషికం, మెరుగైన అవకాశాలు లభిస్తాయి. అయితే, కొందరు అందాల భామలకు ఈ స్టార్‌డమ్ అందని ద్రాక్షగా మిగిలిపోతోంది. వరుస ప్రయోగాలు చేస్తున్న అనుపమ పరమేశ్వరన్, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నిస్తున్నా, స్టార్ ట్యాగ్ ఇంకా ఆమెను ఊరిస్తూనే ఉంది. నిధి అగర్వాల్, భాగ్యశ్రీ బోర్సే స్టార్ హీరోలతో నటిస్తున్నప్పటికీ, విజయాలు లేకపోవడంతో స్టార్ ఇమేజ్ గురించి ఆలోచించే అవకాశం లేకుండా పోయింది. కెరీర్ ప్రారంభంలో మంచి ఫామ్‌లో కనిపించిన సంయుక్త మీనన్ కూడా స్టార్ లీగ్‌లోకి అడుగు పెట్టడంలో వెనుకబడుతున్నారు. అందుకే ఆమె కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేస్తున్నారు.