
ముంబయి: బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంపై సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ హాట్ కామెంట్స్ చేశాడు. తనకు అవకాశాలు తగ్గడానికి మతం కూడా ఓ కారణం అయుండొచ్చని కామెంట్ చేయడంతో విమర్శలు వచ్చాయి. రెహమాన్ వ్యాఖ్యలపై బాలీవుడ్ భగ్గుమంది. వివాదం ముదరడంతో మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ క్లారిటీ ఇచ్చారు. తన వ్యాఖ్యలు వక్రీకరించారన్నారు. భారత్ తనకు స్ఫూర్తి అంటూ వీడియో విడుదల చేశారు. భారత్ తనకు ఇళ్లు, గురువు అని చెప్పారు. సంగీతానికి గౌరవం తగ్గడమే తన వ్యాఖ్యల అర్థమని క్లారిటీ ఇచ్చారు. తాను ఎప్పుడూ ఎవరినీ బాధపెట్టాలనుకోలేదన్నారు. తన భావాలను స్వేచ్ఛగా ప్రకటించడంతో పాటు భిన్న స్వరాలతో పని చేసే అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉన్నాని ఎఆర్ రెహమాన్ తెలియజేశారు. కొన్ని సార్లు ఉద్దేశాలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని, సంగీతం ద్వారా ఉత్తేజపరచడంతో పాటు గౌరవించడం, సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నానన్నారు. వేవ్ మీట్స్ పిఎం మోడీ ఎదుట ప్రదర్శించిన ‘ఝాలా సంగీతం’ నుంచి మొదలు పెడితే నాగా సంగీతకారులతో కలిసి పని చేయడం తనకు ఎంతో సంతోషం ఇచ్చిందన్నారు.