Reading Time: < 1 minute

సన్ రైజ్ ఎంటర్‌టైన్‌మెంట్, రవి ఆర్ట్ బ్యానర్‌లపై స్వాతిసుధీర్, డాక్టర్ రవి బాల నిర్మిస్తున్న సినిమా ‘రామ్ భజరంగ్’. రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ హీరోలు గా నటిస్తున్న ఈ సినిమాకు సి.హెచ్. సుధీర్ రాజు దర్శక త్వం వహిస్తున్నారు. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ‘గదర్ 2’ హీరోయిన్ సిమ్రత్ కౌర్, ‘బిచ్చగాడు’ ఫేమ్ సట్న టీట స్, ఛాయా దేవి, మనసా రాధాకృష్ణన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రాజా రవీంద్ర, రవి శంకర్, కమల్, షఫీ, శివరామరాజు వెంకట్, ధనరాజ్, రచ్చ రవి, రాకేశ్, ఐశ్వర్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 1980 బ్యాక్ డ్రా ప్‌లో రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు ఫ్యామి లీ ఎలిమెంట్స్ అద్భుతంగా ఉంటాయి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర గ్లింప్స్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది.

ఈ ఈవెంట్‌లో హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ “ఈ సినిమాలో నేను చాలా డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నాను. గ్లింప్స్ చాలా బాగుందని అందరూ అంటున్నారు. డైరెక్టర్ సుధీర్ రాసుకున్న స్క్రిప్ట్ చాలా బాగుంది”అని అన్నారు. డైరెక్టర్ సుధీర్ రాజు మాట్లాడుతూ “ఒక మంచి మాస్ సినిమా చెయ్యాలని ఈ రామ్ భజరంగ్ సినిమా కథ రాసుకున్నా ను. మణిశర్మ సంగీతం, అజయన్ విన్‌సెంట్ కెమెరా వర్క్ ఈ సినిమాకు హైలెట్. రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ ఇద్దరూ హీరోలు పోటీ పడి నటించారు. త్వరలో మా సిని మా టీజర్, ట్రైలర్ విడుదల కాబోతున్నాయి”అని తెలిపారు. నిర్మాత స్వాతి సుధీర్ మాట్లాడుతూ “రాజ్ తరుణ్ చేస్తున్న 25వ సినిమా రామ్ భజరంగ్. సందీప్ మాధవ్‌కు ఈ సినిమా మరో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది”అని తెలియజేశారు. కార్యక్రమంలో సందీప్ మాధవ్, మానస రాధాకృ ష్ణ, రవి బాల, అజయన్ విన్‌సెంట్, వెంకట్ పాల్గొన్నారు.