
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఐపిఎస్‌లకు స్థాన చలనం కలిగించింది. ఈ మేరకు 20 మంది ఐపిఎస్‌లను బదిలీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సైబరాబాద్ జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న గాజారావు భూపాల్ లాజిస్టిక్, స్పోర్ట్, వెల్‌ఫెయిర్ ఐజిగా బదిలీ అయ్యారు. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిఐజిగా అభిషేక్ మహంతి, ఆర్. బాస్కరన్ ఇంటెలిజెన్స్ డిఐజిగా, జి.చందన దీప్తి ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ అడిషనల్ సిపిగా, టి. అన్నపూర్ణ సైబరాబాద్ డిసిపిగా, బి.కె. రాహుల్ హెగ్దే హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ 3 జోన్ డిసిపిగా, కె. అపూర్వ రావు హైదరాబాద్ ఇంటెలిజెన్స్ ఎస్పిగా, బి. బాలస్వామి విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పిగా, ఆర్. వెంకటేశ్వర్లు సిఐడి ఎస్పిగా, ఎస్. చైతన్య కుమార్ చార్మినార్ హైదరాబాద్ సిటీ క్రైం డిసిపిగా,
అవినాష్ కుమార్ హైదరాబాద్ సిటి ట్రాఫిక్ 1 జోన్ డిసిపిగా, కాజల్ హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ 2 జోన్ డిసిపిగా, ఎస్. శశిధరిణి రెడ్డి సైబరాబాద్ కమిషనరేట్ ట్రాఫిక్ 2 జోన్ డిసిపిగా, కనకాల రాహుల్ రెడ్డి మల్కాజ్‌గిరి కమిషనరేట్ ట్రాఫిక్ జోన్ 1 డిసిపిగా, శివం ఉపాధ్యాయ ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ డిసిపిగా, వి. శ్రీనివాసులు మల్కాజ్‌గిరి కమిషనరేట్ ట్రాఫిక్ 2 జోన్ డిసిపిగా, జె. రంజని రత్నకుమార్ సైబరాబాద్ కమిషనరేట్ ట్రాఫిక్ 1 జోన్ డిసిపిగా, మల్కాజ్‌గిరి డిసిపిగా విధులు నిర్వహిస్తున్న కె. శ్యాంసుందర్ హైదరాబాద్ సిటీ సిఏఆర్‌కు, పి.అశోక్ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిషనల్ ఎస్పిగా బదిలీ అయ్యారు. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిషనల్ ఎస్పిగా విధులు నిర్వహిస్తున్న ఏ. బాలకోటిను డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.