Reading Time: < 1 minute

హైదరాబాద్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఓటమిని చవిచూడడంతో క్రికెట్ అభిమానులు, క్రికెట్ పండితులు విమర్శలు చేస్తున్నారు. అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నిస్తున్నారు. మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ రెండో వన్డేలో ఓటమి స్పందించాడు. రెండో వన్డేలో అర్షదీప్ సింగ్‌ను ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించాడు. తక్కువ స్కోర్లను డిఫెండ్ చేయడం బౌలర్లు నేర్చుకోవాలని సలహా ఇచ్చాడు. వికెట్ టేకర్ పాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్‌ను కాదని ప్రసిద్ధ్ కృష్ణను తీసుకోవడం మంచి నిర్ణయం కాదని సూచించారు. ఒకటి రెండు మ్యాచ్‌లు మినహాయిస్తే ఎక్కువ పరుగులు ఇచ్చే బౌలర్ ప్రసిద్ధేనని తెలియజేశారు. 280 పరుగుల తక్కువ కాబట్టే భారత జట్టు రెండో వన్డేలో ఓటమి చవి చూసిందని అనడం కరెక్ట్ కాదన్నారు. ఇలాంటి బౌలింగ్ ఉంటే వరల్డ్ కప్ గెలవడం కష్టమన్నారు. 270 నుంచి 280 పరుగుల చేసిన కూడా బౌలర్లు మ్యాచ్ గెలిపించాలని హెచ్చరించారు. తక్కువ పరుగులు ఉన్నప్పుడు మ్యాచ్‌లో ఎలా విజయం సాధించాలనే దానిపైన ఆలోచన పెట్టాలన్నారు. రెండో వన్డేలో కివీస్ విజయం సాధించి సీరిస్‌లో సమంగా ఉన్నారు. మూడో వన్డే ఇండోర్ వేదికగా ఆదివారం జరగనుంది. చివరి వన్డేలో ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం పుష్కలంగా ఉంది. మూడో వన్డేలో భారత జట్టు విజయం సాధించాలంటే బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేయాలని క్రికెట్ పండితులు సూచిస్తున్నారు. ఇలాంటి బౌలింగ్‌తో వన్డే వరల్డ్ కప్ గెలవడం కష్టమని అన్నారు.