
పాట్నా: లారీ ప్రమాదంలో బాలుడి మృతి చెంది ఉండగా స్థానికులు చేపల కోసం ఎగబడ్డారు. ఈ సంఘటన బిహార్ రాష్ట్రం సీతామర్హి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పుప్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝాజిహాట్ గ్రామంలో రితేష్ కుమార్ అనే విద్యార్థి ఏడో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం రితేష్ సైకిల్‌పై కోచింగ్ క్లాస్‌కు వెళ్తుండగా వెనక నుంచి ట్రక్కు అతడిని ఢీకొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందారు. చేపలు ట్రక్కు అని తేలవడంతో స్థానికులు ఎగబడ్డారు. చేపల ట్రేలను ఎత్తుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.