
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ధర్శకత్వంలో తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘పూరి-సేతుపతి’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా ప్రచారంలో ఉంది. అయితే విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించారు. ఈ సినిమాకు ‘స్లమ్ డాగ్’ అనే నామకరణం చేశారు. ‘33 టెంపుల్ రోడ్’ అనేది క్యాప్షన్. ఈ మేరకు ఫస్ట్ లుక్ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో విజయ్ సేతుపతి పదునైన కత్తి పట్టుకొని మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు.
ఈ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘మురికివాడల నుంచి ఎవరూ తట్టుకోలేని తుపాను వస్తుంది.. అది చాలా భయంకరంగా ఉంటుంది’ అంటూ ఓ సినిమా గురించి రాసుకొచ్చింది చిత్ర యూనిట్. గతేడాది జులై మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా.. కేవలం ఐదు నెలల్లోనే పూర్తి చేశారు. ఈ సినిమాలో సంయుక్త, టబు, విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాతో అయినా పూరి కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆయన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.