Reading Time: < 1 minute

హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై అతి వేగంతో ఆర్టిసి బస్సు, లారీ బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. ఈ ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ లో హెచ్ డి ఎఫ్ సి లో బ్యాంకులో పని చేస్తున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఎల్లమ్మరంగాపురం వంగూరు మండలానికి చెందిన రాజుగా పోలీసులు గుర్తించారు.