Reading Time: < 1 minute

బుధవారం రాత్రి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమీపంలోని బైరసియా ప్రాంతంలో ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది.ఒక పికప్ వ్యాన్ , ట్రాక్టర్-ట్రాలీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా మరో 12 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం భోపాల్‌లోని హమీదియా ఆసుపత్రికి తరలించారు.మకర సంక్రాంతి సందర్భంగా నర్మదా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి హోషంగాబాద్ (నర్మదాపురం) వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు.మృతులంతా విదిశ జిల్లాలోని సిరోంజ్ ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ముకేశ్ అహిర్వార్, బబ్రీ బాయి, దీపక్, లక్ష్మీ బాయి మరియు హరి బాయి ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.