
ఇరాన్ ప్రభుత్వం జనవరి ౧౫, 2026 తెల్లవారుజామున తన గగనతలాన్ని (Airspace) వాణిజ్య విమానాల కోసం మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తొలుత కొద్ది గంటల పాటు మూసివేసినప్పటికీ ఆ తర్వాత మూసివేతను ఉదయం 7:30 గంటల (స్థానిక కాలమానం) వరకు పొడిగించారు.ఇరాన్‌లో కొనసాగుతున్న దేశవ్యాప్త నిరసనలపై ప్రభుత్వ ఉక్కుపాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో సైనిక చర్య జరిగే అవకాశం ఉందన్న ఆందోళనల మధ్య ఈ భద్రతా చర్యలు తీసుకున్నారు. ఈ మూసివేత కారణంగా అంతర్జాతీయ విమానాలు ఇరాన్ మీదుగా కాకుండా ఇతర మార్గాల్లో మళ్లించబడుతున్నాయి. భారత విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా (Air India), ఇండిగో (IndiGo) మరియు స్పైస్‌జెట్ (SpiceJet) తమ విమానాల మళ్లింపు లేదా రద్దు కారణంగా ప్రయాణీకులకు హెచ్చరికలు జారీ చేశాయి. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక నిరసనలతో ఇరాన్ లో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ఈ నేపధ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఇరాన్ లోని భారతీయులంతా దేశాన్ని వీడాలని సూచింది, ఇరాన్ కు ఎవరూ వెల్లొదని పేర్కొంది.