Reading Time: < 1 minute

యూట్యూబ్ చూసి మేనత్త కొడుకును హత్య చేసిన సంఘటన హరియాణాలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సంజయ్ శర్మ హారియాణలోని బుసాయి ప్రాంతానికి చెందినవాడు. సంజయ్ శర్మ తన అత్త కొడుకు గురుదత్ శర్మ తో 14 సంవత్సరాల క్రితం స్టోన్ క్రషర్ వ్యాపారం చేశాడు. గురదత్ శర్మ డెహ్రడూన్ లో ఉండేవాడు. అయితే ఇద్దరి మధ్య లావాదేవీల విషయంలో గొడవలు రావడంతో సంజయ్ శర్మ పై గురుదత్ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో జనవరి 6న సంజయ్ శర్మను గురదత్ కారుతో గుద్ది ఆ తర్వాత తుపాకీతో కాల్చి చంపాడు. పోలీసుల విచారణలో పాత కక్షలతో సంజయ్ ని చంపినట్లు గురుదత్ ఒప్పుకున్నాడు. యూట్యూబ్ యూసి హత్య చేసినట్లు గురదత్ పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు గురుదత్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.