Reading Time: < 1 minute

సంక్రాంతి రోజున ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. అల్లు అర్జున్ హీరోగా బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ మేకర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ ప్రతిష్టాత్మక సినిమా రాబోతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్… బివి వర్క్‌తో కలిసి నిర్మిస్తోన్నఈ సినిమా నేషనల్ రేంజ్‌లో అభిమానులు, ప్రేక్షకుల అంచనాలను పెంచేస్తోంది. ఈ భారీ చిత్రానికి నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. బన్నీవాస్‌తో పాటు నట్టి, శాండీ, స్వాతి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా షూటింగ్ 2026 ఆగస్టులో ప్రారంభం కానుంది. ఎఎ23 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కునున్న ఈ సినిమాలో అల్లు అర్జున్… లోకేష్ కనగరాజ్ డైనమిక్ దర్శకత్వంలో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు.