
వయసు ఒక నంబర్ మాత్రమేనని నిరూపించిన హాట్ బ్యూటీ మలైకా అరోరా 52 వయసులోను ఎనర్జిటిక్ డ్యాన్సులు, ఫ్యాషన్ షోలతో దుమారం రేపుతోంది. వయసుతో సంబంధం లేకుండా ఎంతో ఆత్మవిశ్వాసంతో తనపై వస్తున్న ట్రోలింగ్‌లకు ఆమె ధీటైన సమాధానాన్నిస్తోంది. తాజాగా ఓ షోలో పాల్గొన్న మలైకా మాట్లాడుతూ ఐటమ్ సాంగ్స్ (స్పెషల్ నంబర్స్) చేయడం తనను తాను శక్తివంతంగా మలుచుకునేలా చేస్తాయని తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. ’‘నేను 52 ఏళ్ల వయస్సులో కూడా ఇవన్నీ చేయగలుగుతున్నానంటే, నేను ఏదో ఒక విషయంలో సరైన మార్గంలోనే ఉన్నానని అర్థం. ప్రజలు ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటారు.. ట్రోల్ చేస్తుంటారు.. కానీ అందులో పెద్ద విషయం ఏముందో నాకు అర్థం కాదు”అని అన్నారు.