
మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ స్టాంప్‌డ్యూటీ స్కాంపై ప్రభుత్వం విచారణ జరుపుతుండగానే గిప్ట్‌డీడ్ పేరు తో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టినట్టుగా తేలింది. గిప్ట్‌డీడ్ పేరుతో రెవె న్యూ అధికారులు కోట్ల రూపాయలను కొల్లగొట్టినట్టుగా తెలిసింది. తహసీల్దార్‌లకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగించినప్ప టి నుంచి ఇప్పటివరకు వారు చేసిన రిజిస్ట్రేషన్ లు, రాష్ట్రవ్యాప్తంగా జరిగిన లావాదేవీలు, చెల్లించిన స్టాంప్ డ్యూటీ, చెల్లించాల్సిన స్టాంప్ డ్యూ టీల గురించి ఆడిటింగ్ జరగలేదు. దీంతో రెవె న్యూ అధికారులు తమ ఇష్టానుసారంగా ప్రభు త్వ ఆదాయానికి గండికొట్టినట్టుగా తెలిసింది. మాములుగా ప్రతి డాక్యుమెంట్‌కు సేల్‌డీడ్‌కు
స్టాంపు డ్యూటీని 7శాతంగా చెల్లించాల్సి ఉం టుంది. గిప్ట్‌డీడ్‌కు మాత్రం 3శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకొని కొందరు రెవెన్యూ అధికారులు బంధుత్వం లేకున్నా చాలా రిజిస్ట్రేషన్‌లను గిఫ్ట్‌డీడ్ కింద చే సి ప్రభుత్వ ఆదాయానికి 4శాతం స్టాంపు డ్యూ టీని గండికొట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. ఇప్పటికే దీనిపై ఫిర్యాదులు అందినా కనీ సం ఆడిటింగ్ కూడా జరపలేదని తెలుస్తోంది. ప్రస్తుతం పలు మీసేవ సెంటర్‌లలో జరిగిన స్టాంప్‌డ్యూటీ కుంభకోణం గురించి ఆయా జి ల్లాల కలెక్టర్‌లు విచారణ జరుపుతుండగా ప్రస్తు తం గిప్ట్‌డీడ్ స్టాంపు డ్యూటీ వసూళ్లలోనూ భారీగా అవకతవకలు జరిగాయని కలెక్టర్‌లు గుర్తించినట్టుగా తెలిసింది. దీనిపై కూడా పూర్తిస్థాయిలో ఆడిటింగ్ చేస్తే ప్రభుత్వానికి ఎన్నికోట్ల నష్టం వచ్చిందన్న వివరాలు తెలిసే అవకాశం ఉంటుందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో
నిరంతరం ఆడిటింగ్
మాములుగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో సబ్ రిజిస్ట్రార్‌లు చేసే రిజిస్ట్రేషన్‌లకు సంబంధించి ఆ శాఖ నుంచి రెండు నెలలకోసారి ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రతి డాక్యుమెంట్‌కు సంబంధించి ఆడిటింగ్ నిర్వహిస్తారు. దీంతోపాటు ప్రభుత్వానికి రావాల్సిన స్టాంప్ డ్యూటీతో పాటు మార్కెట్‌వాల్యూను సబ్ రిజిస్ట్రార్ కచ్చితంగా వసూళ్లు చేశారా లేదా అన్నది ఆడిటింగ్ చేసి ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక అందచేస్తారు. దీంతోపాటు గిఫ్ట్‌డీడ్‌కు సంబంధించిన డాక్యుమెంట్‌లకు రిజిస్ట్రేషన్లు జరిగితే ఆ రిజిస్ట్రేషన్‌ల వల్ల ప్రభుత్వ ఆదాయానికి ఏమన్నా నష్ట వచ్చిందా లేదా బంధుత్వం పేరుతో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారన్న విషయాలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఆరా తీస్తారు. ఇలా ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చేపడుతున్న చర్యలనే రెవెన్యూ శాఖలోనే అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
సిసిఎల్‌ఏ కేంద్రంగా స్కాం
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ స్టాంప్‌డ్యూటీ స్కాం సిసిఎల్‌ఏ కేంద్రంగా జరిగిందని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. పలు జిల్లాలోని మీ సేవ కేంద్రాలు, భూ భారతి ఆపరేటర్‌ల ద్వారానే ఈ స్కాంకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. 2024 మార్చి వరకు యథేచ్ఛగా ఈ స్కాం జరిగినట్టుగా సమాచారం. ముఖ్యంగా స్టాంప్‌డ్యూటీ అధికంగా జరిగే ప్రాంతాల్లోనే ఈ స్కాం జరిగినట్టుగా తెలిసింది. దీనికితోడు రెవెన్యూ అధికారులు కూడా ఈ స్కాంలో ప్రధాన పాత్ర పోషించారని విచారణ తేలినట్టుగా సమాచారం. అయితే, స్టాంప్‌డ్యూటీలో తేడాలు వచ్చిన వారి నుంచి మిగతా డబ్బులను వసూళ్లు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నా దానికి క్రయ, విక్రయాల చేసిన వారు ఎంతవరకు సహకరిస్తారన్నది తెలియాల్సి ఉంది.