Reading Time: < 1 minute

విశాఖ: ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా విశాఖపట్నంలోని ఎసిఎ-విడిసిఎ క్రికెట్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో టి-20 మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే తొలి మూడు మ్యాచుల్లో గెలిచి విజయోత్సాహంతో ఉన్న భారత్ ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి కివీస్‌ని చిత్తు చేయాలని అనుకుంటోంది. మరోవైపు చివరి రెండు మ్యాచుల్లో అయినా విజయం సాధించి పరువు దక్కించుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పు చేసింది. ఇషాన్ కిషన్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్ కూడా జట్టులో ఒక మార్పు చేసింది. జెమీసన్ బదులు ఫౌల్క్స్‌ని జట్టులోకి తీసుకుంది.

తుది జట్లు:

భారత్: అభిషేక శర్మ, సంజూ శాంసన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.

న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(కీపర్), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), జాకరీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీ.