
హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్‌లోని శ్రీనివాస్‌నగర్‌లో మంగళవారం ఉదయం బాలికపై శునకం దాడి చేసిన ఘటన తెలిసిందే. ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల శార్విపై వీధి కుక్క దాడి చేసింది. దీంతో ఆ పాపకు ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తల్లిదండ్రులు మల్లికార్జున్, రేవతిలు పాపను రెయిన్‌బో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్ స్పందించింది. మీడియాలో వచ్చిన వార్తలను సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ ఘటనపై తీసుకున్న చర్యలు, అమలులో ఉన్న నివారణ చర్యలపై వివరణాత్మక నివేదిక ఫిబ్రవరి 24లోగా ఇవ్వాలని జిహెచ్‌ఎంసి కమిషనర్‌ను ఆదేశించింది.