
న్యూఢిల్లీ: స్థూల జీఎస్టీ వసూళ్ల విలువ గత నెల 8.8 శాతం వృద్ధి చెంది రూ.రెండు లక్షల కోట్లు దాటింది. దేశీయ అమ్మకాలు, దిగుమతుల నుంచి వచ్చిన పన్నుల ఆదాయం ఇందుకు తోడ్పడింది. గతేడాది మార్చిలో ఈ వసూళ్ల విలువ రూ.1.83 లక్షల కోట్లుగా నమోదయింది.
దేశీయ ఆదాయం 5.9 శాతం పెరిగి రూ.1.46 లక్షల కోట్లు దాటగా.. దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం 17.8 శాతం వృద్ధితో రూ.53,861 కోట్లుగా ఉంది. రీఫండ్ల చెల్లింపుల తర్వాత నికర జీఎస్టీ ఆదాయం రూ.1.78 లక్షల కోట్లు ఉంది.