Reading Time: < 1 minute
Hyderabad: మీ వాహ‌నానికి 15 ఏళ్లు దాటాయా.? ఇలా చేయకుంటే అడ్డంగా బుక్కైనట్లే..

తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన తర్వాత వాటిని రోడ్లపై నడపడం చట్టరీత్యా నేరం. మీ వాహనం కొని 15 ఏళ్లు పూర్తయిందా.? అయితే ఆర్‌సీ గడువు ముగియక ముందే పునరుద్ధరణ చేసుకోవడం తప్పనిసరి. గడువు దాటిన వాహనాలను రోడ్లపై నడపడం వల్ల భారీ జరిమానాలు పడటమే కాకుండా, ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ పొందే అవకాశం కూడా ఉండదు. సాధారణంగా వ్యక్తిగత వాహనాల రిజిస్ట్రేషన్ 15 ఏళ్ల వరకు చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత ప్రతి 5 ఏళ్లకు ఒకసారి దీనిని పునరుద్ధరించుకోవాలి. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి.? అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి.? గ్రీన్ టాక్స్ వివరాలు ఇలా..

ఇది చదవండి: జేసీబీతో పొలంలో తవ్వకాలు జరుపుతుండగా.. బరువుగా తగిలిన కుండ.. బద్దలుకొట్టి చూడగా

RC రెన్యూవల్..

స్లాట్ బుకింగ్: ముందుగా తెలంగాణ రవాణా శాఖ అధికారిక వెబ్‌సైట్ లేదా T App Folio ద్వారా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలి.

ఫీజు చెల్లింపు: వాహన రకాన్ని బట్టి నిర్దేశిత ఛార్జ్ ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. 15 ఏళ్లు దాటిన వాహనాలకు ‘గ్రీన్ టాక్స్’ కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

వాహన తనిఖీ: స్లాట్ బుక్ చేసుకున్న రోజున వాహనాన్ని సంబంధిత RTO కార్యాలయానికి తీసుకెళ్లాలి. అక్కడ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ వాహనం కండిషన్‌ను చెక్ చేస్తారు.

డాక్యుమెంట్ల సమర్పణ: చెక్ చేసిన తర్వాత అవసరమైన పత్రాలను సమర్పించాలి. వాహనం ఫిట్‌గా ఉందని నిర్ధారించుకున్నాక, మీ RCని మరో 5 ఏళ్ల వరకు పొడిగిస్తారు.

కావలసిన డాక్యుమెంట్స్:

ఒరిజినల్ RC బుక్.

ఫారం-25 (Form 25).

చెల్లుబాటులో ఉన్న ఇన్సూరెన్స్ కాపీ.

పొల్యూషన్ సర్టిఫికేట్ (PUC).

అడ్రస్ ప్రూఫ్ (ఆధార్ లేదా ఓటర్ కార్డ్).

వాహనం ఛాసిస్ నంబర్ పెన్సిల్ ప్రింట్.

ఇది చదవండి: తెలంగాణలో స్కూల్స్‌కి వేసవి సెలవులు ఎప్పటినుంచంటే.? ఈసారి భారీగానే..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి