
ధర్మపురి: జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధ రాత్రి ధర్మపురి పట్టణంలోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. ఓవర్ టెక్ చేస్తూ, ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టి.. తర్వాత ఆటోను ఢీకొంది.ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ఘటనలో ఆటో బోల్తా పడటంతో.. అందులో ప్రయాణిస్తున్న పలువురు హనుమాన్ భక్తులకు గాయాలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం అంబులెన్స్ లో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. మృతులను ధర్మపురికి చెందిన ఇద్దరు, సారంగాపూర్ మండలం రేచ్ పల్లి గ్రామానికి చెందిన ఒక్కరిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరపనున్నట్లు తెలిపారు.