Reading Time: < 1 minute

వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. రెండు మూడు వారాల్లో ఇరాన్ పై భీకర దాడులు చేస్తామని తెలిపారు. తాజాగా ట్రంప్, జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇరాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని.. అందుకే ఆ దేశంపై దాడి చేశామని చెప్పారు. ఇరాన్ తీవ్రంగా ప్రతిఘటిస్తుండటంతో ఇప్పట్లో యుద్ధం ఆగే పరిస్థితి లేదని.. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతుందని తెలిపారు.

ఇప్పటికే అమెరికా సైన్యం.. ఇరాన్ ఎయిర్ ఫోర్స్, నేవీని పూర్తిగా ధ్వసం చేసిందని ట్రంప్ చెప్పారు. వారి నాయకుల్లో చాలా మంది హతమయ్యారన్నారు. క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగించే వారి సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయిందన్నారు. ఎప్పటికీ ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయకుండా చేశామన్నారు. వారి ఉగ్రవాద పాలన ఇప్పుడు అంతమయ్యిందన్నారు. మరో రెండు, మూడు వారాల్లో ఇరాన్ పై భీకర దాడులు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. త్వరలో ఇరాన్‌లో తమ పని పూర్తి చేస్తామని ట్రంప్‌ తెలిపారు.