Reading Time: < 1 minute

తిరుపతిలో మారియట్ హోటల్

Caption of Image.

హైదరాబాద్​, వెలుగు: ఆంధ్రప్రదేశ్ నగరం తిరుపతిలో  కోర్ట్​ యార్డ్ బై మారియట్ హోటల్ ప్రారంభమైంది. మారియట్ బాన్వాయ్ గ్రూప్ దీనిని నిర్మించింది. తిరుమలను దర్శించుకునే వారి కోసం 130 గదులతో దీనిని కట్టారు. రైల్వే స్టేషన్ నుంచి 15 నిమిషాలు, విమానాశ్రయం నుంచి 20 నిమిషాల ప్రయాణ దూరంలో ఈ హోటల్ ఉంది. ఇందులో జిమ్, స్పా, స్విమ్మింగ్​పూల్​ వంటి సదుపాయాలు ఉన్నాయి.

©️ VIL Media Pvt Ltd.