
హైదరాబాద్, వెలుగు: నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) తెలంగాణ 2026–2028 మధ్య కాలానికి నూతన నాయకత్వ బృందాన్ని ప్రకటించింది. హైదరాబాద్‌లో జరిగిన 30వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీధర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లుగా కాళీప్రసాద్, గోపాలకృష్ణ ఎన్నికయ్యారు. సెక్రటరీ జనరల్ గా వెంకటేశ్వరరావు , ట్రెజరర్‌గా సుధాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు.
తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరమైన వృద్ధిని ప్రోత్సహించడం తమ ప్రధాన లక్ష్యమని వీళ్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాల సాధనలో భాగస్వాములు అవుతామని శ్రీధర్‌రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.