
మేష రాశి వారు నేడు నిరుద్యోగ సమస్యల నుంచి విముక్తి పొందుతారు. వీరికి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి అన్ని పనుల్లో అనుకూలత ఉంటుంది కానీ అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. మిధున రాశి వారు బంధుమిత్రులను కలుసుకుంటారు, శుభ కార్యాలపై చర్చలు జరుపుతారు. అయితే వ్యాపారంలో కొంత జాగ్రత్త అవసరం. కర్కాటక రాశి వారు నేడు శుభ కార్యాలకు ప్రణాళికలు వేసుకుంటారు, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసర. సింహ రాశి వారికి ఉద్యోగ పరంగా మంచి ఫలితాలు ఉంటాయి, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు చెప్పిన నేటి దిన ఫలాలను భక్తి టీవీ మీకు అందిస్తోంది.