Reading Time: 2 minutes
Lungi Ngidis Stunning Yorker Stuns Nicholas Pooran Best Ball Of Ipl 2026 So Far

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2026లో ప్రారంభమై ఐదు రోజులు కాగా.. అన్ని జట్లు ఒక్కో మ్యాచ్‌ను ఆడేశాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఎన్నో అద్భుత క్షణాలను మనం ఆస్వాదించాం. అద్భుత బ్యాటింగ్, సూపర్ క్యాచ్, బెస్ట్ బౌలింగ్ గణాంకాలు నమోదు కాగా.. బుధవారం జరిగిన మ్యాచ్‌లో నమోదైన ఒక బంతి మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి వేసిన ఆ అద్భుత డెలివరీ ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ‘బెస్ట్ బాల్’గా నిలిచింది.

Also Read: Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈరోజు మీకు ఎలా ఉండబోతోంది?

మొట్టమొదటిసారి ఐపీఎల్‌లో ఢిల్లీ తరఫున ఆడుతున్న లుంగి ఎంగిడి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ బ్యాటర్ నికోలస్‌ పూరన్‌ను ఔట్ చేసిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. బంతిని ముందుకు వచ్చి ఆడాలని ప్రయత్నించిన పూరన్‌.. ఎంగిడి వేసిన యార్కర్‌కు బలైపోయాడు. యార్కర్ లెంత్‌లో కచ్చితంగా పడిన ఆ బంతి పూరన్‌ ఏమీ చేయలేకపోయాడు. సరైన టైమింగ్‌తో డిఫెన్స్ ఆడకపోతే.. ఎలాంటి బ్యాటర్ అయినా ఔట్ అవ్వాల్సిందే అన్నట్లుగా ఆ డెలివరీ నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘లుంగి ఎంగిడి అద్భుత బంతి’, ‘నికోలస్‌ పూరన్‌ మైండ్ బ్లాక్ అయిందిగా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.