Reading Time: < 1 minute

ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాల మరణంపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అజిత్ పవార్ మరణం గురించి తెలిసి ఎంతో బాధపడుతున్నా..ప్రజల కోసం అంకితభావంతో పని చేసిన ఓ మంచి నాయకుడిని మహారాష్ట్ర కోల్పోయిందని..ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులకు నా సానుభూతి.. ఓ శాంతి అని సచిన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

కాగా, బుధవారం ఎన్నికల ప్రచారం నిమిత్తం అజిత్ పవార్ ముంబై నుంచి బారామతికి విమానంలో బయలుదేరి వెళ్లారు. అయితే ఆయన ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురి కావడంతో పవార్‌తో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు.