
రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దురంధర్’. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. మొదటి షో నుంచే హిట్ టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ఈ సినిమా విక్కీ కౌశల్ ఛావా, రిషబ్ శెట్టి కాంతార-ఛాప్టర్-1 సినిమాలను అధిగమించింది.
తాజాగా ఈ సినిమా మరో అరుదైన ఘనతను సాధించింది. ఇండియాలో వెయ్యి కోట్లపైగా వసూళ్లు సాధించిన సినిమాగా ఈ సినిమా నిలిచింది. వెయ్యి కోట్లు సాధించిన సినిమాల లిస్టులో దురంధర్ మూడో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో యశ్ నటించిన ‘కెజిఎఫ్-2’ సినిమాను దాటేసింది. ఈ జాబితాలో మొదటిస్థానంలో రూ.1,471 కోట్లతో అల్లు అర్జున్ ‘పుష్ప-2’, రెండో స్థానంలో రూ.1417 కోట్లతో ప్రభాస్ ‘బాహుబలి-ది కన్‌క్లూజన్’ సినిమాలు ఉన్నాయి. తాజాగా దురంధర్ రూ.1002 కోట్లతో మూడోస్థానాన్ని సొంతం చేసుకుంది. అంతేకాక… అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ సినిమాగా ఇది నిలిచింది. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ (రూ.760 కోట్లు)ను ఈ సినిమా అధిగమించింది.
స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది మార్చిలో దురంధర్-2 సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.