Reading Time: < 1 minute

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరోహీరోయిన్లుగా నటించిన హిలేరియస్ విలేజ్ కామెడీ ఎంటర్ టైనర్ ’ఓం శాంతి శాంతి శాంతిః. ఎఆర్ సజీవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ వెంచర్‌ను నిర్మిస్తుండగా, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఓం శాంతి శాంతి శాంతిః జనవరి 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ “డైరెక్టర్ సజీవ్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో గోదారి యాస చక్కగా పలికాను. ఈషా… శాంతి క్యారెక్టర్‌కు ప్రాణం పోశారు” అని అన్నారు. డైరెక్టర్ సజీవ్ మాట్లాడుతూ “ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ ఓంకార్ నాయుడు పాత్రలో గుర్తుండిపోతారు. కచ్చితంగా ఈ సినిమా అందరికీ ఒక కొత్త అనుభూతినిస్తుంది”అని తెలిపారు. నిర్మాత సృజన్ మాట్లాడుతూ ఎన్నిసార్లు చూడాలనుకున్నా మళ్లీ చూడొచ్చని నమ్మి చేసిన సినిమా ఇదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈషా రెబ్బా, బివిఎస్ రవి, విశ్వక్‌సేన్, ప్రియదర్శి, అనూప్, వివేక్. అభినవ్, శ్రీనాథ్ మాగంటి తదితరులు పాల్గొన్నారు.