
మన తెలంగాణ/క్రీడా విభాగం: న్యూజిలాండ్‌తో జరుగుతున్న టి20 సిరీస్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు సంజు శాంసన్ వరుస వైఫల్యాలతో నిరాశ పరుస్తున్నాడు. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన సంజు కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు. తొలి టి20లో పది, రెండో మ్యాచ్‌లో ఆరు పరుగులు సాధించాడు. ఇక గౌహతిలో జరిగిన కిందటి మ్యాచ్‌లో తొలి బంతికే ఔటయ్యాడు. ఇలా వరుస వైఫల్యాలు చవిచూస్తున్న సంజు శాంసన్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురుస్తోంది.
అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో అతను పూర్తిగా విఫలమయ్యాడనే చెప్పాలి. సహచర ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసక బ్యాటింగ్‌తో సిరీస్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తుండగా సంజు మాత్రం పేలవమైన బ్యాటింగ్‌తో తేలిపోతున్నాడు. ఇలాగే ఆడితే ఆడితే అతనికి రానున్న రోజుల్లో తుది జట్టులో చోటు లభించడం దాదాపు అసాధ్యమేనని చెప్పాలి. ఇప్పటికైనా సంజు శాంసన్ తన బ్యాటింగ్‌ను మెరుగు పరుచుకోవడంపై దృష్టి సారించాలి. లేకుంటే టీమిండియాలో చోటు నిలబెట్టు కోవడం చాలా కష్టం.