Reading Time: < 1 minute

అమరావతి: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. ఏడాదిన్నరగా సదరు ఎంఎల్ఎ నరకం చూపిస్తున్నాడని బాధితురాలు తెలిపింది. పెళ్లి పేరుతో మోసం చేశాడని బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. శారీరకంగా తనను హింసించడని జ‌న‌సేన ఎమ్మెల్యే బాధితురాలి వీడియో విడుద‌ల‌ చేసింది. ప‌రిచ‌య‌మైన రెండు రోజులకే తనని బెదిరించారని, తన కుమారుడు, తాను మాత్ర‌మే ఉంటున్నానని జాగ్ర‌త్త‌ అని ఎంఎల్ఎ ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇది తన కోడూరు, తన నియోజ‌క‌వ‌ర్గం, సదరు యువతిపై ఎంక్వైరీలు వేయించడంతో పాటు ట్రాన్స్‌ఫర్లు చేయిస్తానని, తన  ద‌గ్గ‌రికి రావాల‌ని ఎంఎల్ఎ బెదిరించాడని బాధితురాలు ఆరోపణలు చేసింది. క‌డ‌ప‌కు వెళ్దామ‌ని కారులో తీసుకెళ్లి రాజంపేట వ‌ద్ద నిర్మానుష్య ప్ర‌దేశానికి తీసుకెళ్లి, తన ప్రైవేట్ పార్ట్స్ తాకడంతో పాటు యువతి కారు డోరు ఓపెన్ చేయ‌బోతే గ‌ట్టిగా కొట్టి తనపై అత్యచారం చేశాడని ఆరోపణలు చేసింది. ఆగ‌స్టులో ఫ‌స్ట్ ప్రెగ్నెన్సీ వ‌స్తే దాన్ని అబార్ష‌న్ చేయించుకోవాల‌ని ఎంఎల్ఎ ఒత్తిడి చేశాడని, పెళ్లి చేసుకుంటాన‌ని ప్రామీస్ చేయ‌డంతో అబార్ష‌న్ చేసుకున్నానని, గ‌త ఏడాదిన్న‌ర కాలంలో ఐదుసార్లు అబార్ష‌న్స్ చేశారని, తన భ‌ర్త‌కు కాల్ చేసి విడాకులు ఇవ్వాల‌ని బెదిరించారని, ఏడాదిన్న‌ర‌గా తన సదరు తనని టార్చ‌ర్ చేశాని బాధితురాలు ఆరోపణలు చేసింది. 

తన కొడుకుపై ఆరోపణలని శ్రీధర్ తల్లి ప్రమీల ఖండించింది. కులం పేరు చెప్పి తన కుమారుడికి దగ్గరైందని, ఇంటికి రావడం మొదలు పెట్టిందని, పగలు, రాత్రి తేడా లేకుండా ఫోన్లు చేసేదని, పెళ్లి చేసుకోవాలంటూ బ్లాక్‌ మెయిల్‌ చేసేదని, ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని ప్రమీల పేర్కొన్నారు.