Reading Time: 2 minutes

న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మం గళవారం నాడు ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది. బడ్జెట్ సమావేశాల్లో విబి- జి రా మ్-జి చట్టంతో పాటు, ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్ )పై చర్చలు జరపాలన్న ప్రతిపక్షాల డిమాండ్ ను ప్రభుత్వం ఆరంభంలోనే తిరస్కరించింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి కిరణ్ రిజిజు ఈ రెండు అంశాలపై ఇప్పటికే ఉభయసభలు చర్చించాయని, మళ్లీ వెనక్కి వెళ్లే ప్రసక్తి లేద ని అఖిలపక్షం సమావేశంలో స్పష్టం చేశారు. బడ్జె ట్ సమావేశాలలో ప్రభుత్వం ఏ అంశాలను సభలో ప్రవేశ పెడుతుందో ఆ విషయాలను తమకు ముం దుగా తెలుపక పోవడం పట్ల కాంగ్రెస్‌కు చెందిన జై రామ్ రమేశ్, సిపిఐ(ఎం)కు చెందిన జాన్ బ్రిట్టాస్, ఇతర సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీనికి తాను త్వరలో ఆ సమాచారం అందజేస్తానని మంత్రి తెలిపారు. బడ్జెట్ సమావేశాలలో సర్, ఎం జిఎన్‌ఆర్‌ఇజిఏ పథకం స్థానే తెచ్చిన విబి-జి-రామ్‌జి చట్టం, భా రతదేశంపై అమెరికా విధించిన సుంకాలు,

విదేశాం గ విధానానికి సంబంధించిన విషయాలు, వాయు కాలుష్యం సమస్య, ఆర్థిక వ్యవస్థ స్థితి, స్కూల్ వయ స్సు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం వంటి పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యులు చర్చించాలని కోరిన ట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విపక్ష ఎంపీలు అ నేక అంశాలను లేవనెత్తారని, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగే చర్చ సందర్భంగా, బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఈ అంశాలను లేవనెత్తవచ్చునని పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి అన్నారు. 2026 కొత్తసంవత్సరంలో ఇది మొదటి సమావేశం. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రభుత్వం ఏ అంశాలను చేపడుతుందో ఆ జాబితా ను తాను ప్రతిపక్ష సభ్యులకు అందజేస్తానని ఆయ న తెలిపారు. సమావేశాలు సజావుగా నడపడంపై ప్రభుత్వం దృష్టి ఉందని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజ న్‌పై చర్చ జరగాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్ర స్తావిస్తూ, గతంలో ఉభయసభల్లో విసృ్తతంగా చ ర్చించామని, మళ్లీ చర్చించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సభ్యులు ఏవైనా సమస్యలు ఉంటే లేవనెత్తాలి కానీ, గొడవలు జరగకూడదని రిజిజు వి జ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులు గా ప్రజా సమస్యలను ప్రస్తావించి, చర్చిద్దాం. ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కు వినియోగించుకుం టూ, ఇతర పార్టీలు చెప్పేది వినాల్సిన బాధ్యత కూ డా మనకు ఉందని, అందువల్ల సభ్యులు సజావుగా బడ్జెట్ సమావేశాలు సాగేలా సహకరించాలని విజ్ఞ ప్తి చేస్తున్నానని కిరణ్ రిజిజు తెలిపారు.