Reading Time: < 1 minute

మెగాస్టార్ చిరంజీవి పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూడవ వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు బుక్‌మైషోలో, ప్రపంచవ్యాప్త వసూళ్లలో సంచలనాత్మక మైలురాళ్లను సాధించింది. మన శంకరవరప్రసాద్ గారు బుక్‌మైషోలో ఆల్‌టైమ్ నంబర్ 1 రీజినల్ ఫిల్మ్ గా నిలిచింది. 15వ రోజుకే 3.6 మిలియన్ టికెట్లు అమ్ముడై, ఇప్పటివరకు రికార్డు కలిగిన సంక్రాంతికి వస్తున్నాం (3.5 మిలియన్)ను అధిగమించింది.

ఈ ఘనతను సాధించిన ఫాస్టెస్ట్ రీజినల్ ఫిల్మ్‌గా ‘మన శంకరవరప్రసాద్ గారు’ రికార్డ్ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కేవలం 15 రోజుల్లో రూ.358 కోట్లకు పైగా వసూలు చేసి రీజినల్ ఇండస్ట్రీ ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఉత్తర అమెరికాలో ఈ చిత్రం 3.5 మిలియన్ డాలర్ల మార్కును దాటే దిశగా దూసుకుపోతోంది. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్‌లోనే భారీ రికార్డులు నమోదు అవుతున్నాయి. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని అత్యున్నతంగా నిర్మించారు.