
ఉద్యమకారులకు ఉద్యమనేతను దూరం చేసిందే సంతోష్‌రావు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సిఎం రేవంత్‌రెడ్డికి సంతోష్‌రావు గూఢచారి అని విమర్శిస్తూ ఆయన పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.సంతోష్‌రావు వల్లే గద్దర్‌లాంటి వాళ్లు ప్రగతిభవన్ గేట్ బయట ఉండాల్సి వచ్చిందని, ఈటల రాజేందర్‌ను బిఆర్‌ఎస్ సస్పెండ్‌కు కారణం కూడా ఆయనని ఆరోపించారు. ఉద్యమకారులను, పేద ప్రజలకు కేసీఆర్‌ను దూరం చేశారని మండిపడ్డారు. అలాంటి వ్యక్తికి అనుకూలంగా కెటిఆర్, హరీష్ రావులు ట్వీట్‌లు పెట్టడాన్ని బిఆర్‌ఎస్ కేడర్ గమనించాలన్నారు. సిట్ అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కవిత డిమాండ్ చేశారు.