Reading Time: < 1 minute

హైదరాబాద్‌: డ్రగ్స్ పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. నిత్యం ఎక్కడో ఓ చోట డ్రగ్స్ పట్టబడుతునే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఈగల్ టీమ్ ను ఏర్పాటు చేసినా.. డ్రగ్స్ పెడ్లర్లు తమ దందాను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. గచ్చిబౌలిలో మాదాపూర్‌ ఎస్ఓటి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎండిఎంఎ డ్రగ్స్‌ విక్రయిస్తున్న సాయికిరణ్ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తోపాటు మరో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ తీసుకొచ్చి విక్రయిస్తుండగా ముగ్గురిని అందుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.