
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం దేవర. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్, యువసుధా ఆర్ట్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్‌రామ్, మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ నిర్మించారు. భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రానికి సీక్వెల్ ‘దేవర 2’ అసలు ఉందా లేదా అంటూ ఎన్నెన్నో రూమర్స్ వినిపిస్తూ వచ్చాయి. కానీ ఫైనల్‌గా వాటి అన్నింటికి సమాధానం వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ దేవర 1కి కొనసాగింపుగా దేవర 2 ప్రకటించారు కానీ ఇది ఆలస్యమవుతూ వచ్చింది.
కానీ తాజాగా నిర్మాతలలో ఒకరైన యువసుధా ఆర్ట్ అధినేత మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాపై అప్‌డేట్ అందించారు. దేవర 2 షూటింగ్ ఈ ఏడాది మే నుంచి మొదలు కానుందని, వచ్చే ఏడాదిలోనే రిలీజ్ అవుతుందని తెలియజేశారు. దీంతో అభిమానులు ఎంతో సంతోషపడిపోతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్… ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో పూర్తి చేసే అవకాశం ఉంది. ఆతర్వాత మే నుంచి దేవర 2 షూటింగ్ మొదలు కానుందట.