Reading Time: < 1 minute

బులవాయో (జింబాబ్వే): U19 ప్రపంచ కప్ 2026లో భాగంగా యువ భారత్, జింబాబ్వే జట్టుతో తలపడుతోంది. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఆయుష్ మాత్రే సారథ్యంలోని టీమిండియా భారీ స్కోరు సాధించింది. యువ బ్యాటర్ విహాన్ మల్హోత్రా సెంచరీతో రాణించాడు. విహాన్ 107 బంతుల్లో 109 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి అర్ధ సెంచరీతో చెలరేగాడు. కేవలం 30 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సులతో 52 పరుగులు చేశాడు. తర్వాత కీపర్ అభిజ్ఞాన్ కుండు కూడా 61 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో స్పిన్నర్ ఖిలాన్ పటేల్ మెరుపులు మెరిపించాడు. కేవలం 12 బంతుల్లోనే వేగంగా 30 పరుగులు రాబట్టాడు. దీంతో భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే 11 ఓవర్లలో మూడు కీలక వికెట్లు కోల్పోయి 29 పరుగులు చేసింది.