Reading Time: < 1 minute

హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. బుధవారం (జనవరి 28) నుంచి ఈ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించే ప్రక్రియ ప్రారంభం అవుతున్నట్లు ఎస్‌ఇసి రాణి కుముదిని మీడియా సమావేశంలో వెల్లడించారు. జనవరి 30వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. జనవరి 31న అభ్యర్థుల నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 3వ తేదీ వరకూ గడువు విధించారు. మొత్తం 116 మున్సిపల్ స్థానాలు, 7 కార్పొరేషన్లకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో 53 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 13న ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రీపోలింగ్ ఎక్కడైనా ఉంటే అది ఫిబ్రవరి 12న నిర్వహించనున్నారు.