
హిట్‌లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలతో ప్రేక్షుకులను అలరించడంలో హీరో కార్తి ఎప్పుడు ముందుంటాడు. ఆయన నించిన లేటెస్ట్ చిత్రం ‘అన్నగారు వస్తారు’. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్. గతేడాది క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. డివైడెటడ్ టాక్ వచ్చినా.. సినిమాకు కలెక్షన్లు బాగానే రాబ్టటింది. అయితే ఈ సినిమా ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. జనవరి 28 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఒటిటి సంస్థ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో రానున్నట్లు తెలిపింది.