Reading Time: < 1 minute

విభిన్న పాత్రలు చేయడంలో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ఎప్పుడు ముందుంటాడు. ఆయన సహజ నటనతో అందరిని ఆకట్టుకుంటాడు. అయితే నటించిన తాజా చిత్రాల్లో ఒకటి ‘గాంధీ టాక్స్’. ఈ చిత్రంలో స్టార్ హీరో అరవింద్ స్వామి కీలక పాత్ర పోషస్తున్నారు. పూర్తిగా మూకీ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ని చిత్ర యూనిట్‌ విడుదల చేసింది

‘‘ప్రతి కథకు మాటలు అవసరం లేదు.. కొన్ని దృశ్యాలు చూడటంతోనే మనస్సును హత్తుకుండాయి. ఈ సారి స్క్రీన్‌పై మాటలు ఉండవు. అది మిమ్మల్ని వినేలా మాత్రమే చేస్తుంది’’ అంటూ చిత్ర యూనిట్ సినిమా గురించి పేర్కొంది. నటీనటుల యాక్టింగ్‌తో పాటు ఎఆర్ రెహమాన్ సంగీతం సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లింది. ఇందులో అదితి రావ హైదరి, సిద్ధార్త్ జాదవ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జనవరి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.