
చెన్నై: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’. అన్ని అనుకున్న విధంగా జరిగి ఉంటే ఈ సినిమా జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. కానీ, అనుకోకుండా ఈ సినిమాకు సెన్సార్ విషయంలో సమస్య ఏర్పడింది. దీంతో సినిమా విడుదల వాయిదా పడింది. అయితే ఈ సినిమా మరో షాక్ తగిలింది. ఈ సినిమా వివాదంలో మద్రాస్ హై కోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో సింగిల్ బెంచ్ ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు, సంభాషలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ‘యు/ఎ’ సర్టిఫికేట్ ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుపై మరోసారి హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది.
మరోసారి విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని తిరిగి సింగిల్ బెంచ్‌ను హైకోర్టు ఆదేశించింది. సెన్సార్ బోర్డుకు తన వాదనలు వినిపించడానికి న్యాయపరమైన అవకాశాలు ఇవ్వాలని పేర్కొంది. ఈ వ్యవహారాన్ని రివైజింగ్ కమిటీకి పంపిన నిర్ణయం సరైనది కాదా.. అనే అంశాన్ని సింగిల్ జడ్జి స్వేచ్ఛగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు తెలిపింది. ఈ కేసుకు సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకొని తగిన విధంగా మరోసారి విచారణ చేసి ఆదేశఆలు జారీ చేసే అధికారం సింగిల్ బెంచ్‌కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.