
హైదరాబాద్: విజయ్ దేవరకొండ హీరోగా.. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘రణబాలి’. రష్మిక ఈ సినిమాలో హీరోయిన్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని పరిచయం చేస్తూ ఓ గ్లింప్స్‌ని విడుదల చేశారు. తక్కువ సమయంలోనే ఈ గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే కొందరు మాత్రం ఈ టీజర్ సహజమైనది కాదని.. ఎఐతో సృష్టించారని పోస్టులు పెట్టారు.
ఈ విషయంపై దర్శకుడు రాహుల్ స్పందించారు. ఈ వీడియోని ప్రతీ ఫ్రేమ్ పాత పద్ధతుల్లోనే ఎంతో కష్టపడి డిజైన్ చేసినట్లు తెలిపారు. ఈ వీడియోని సిద్ధం చేయడానికి తమ టీం కొన్ని నెలల పాటు కష్టపడిందని అన్నారు. దీంతో ఎఐ వాడారనే వార్తలకు చెక్ పడింది. దీంతో ఎఐ సాయం లేకుండానే ఇంత హైక్వాలిటీ వీడియోను డిజైన్ చేసిన చిత్ర టీమ్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. 1854-78 మధ్య బ్రిటీష్ పాలనలో జరిగిన అకృత్యాలను ఎదురుకొని వీరుడి పాత్రలో విజయ్ కనిపించనున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో సర్ థియోడర్ హెక్టార్ పాత్రలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ నటిస్తుండగా.. రష్మిక జయమ్మ పాత్రలో రష్మిక కనిపించనుంది. ఈ సినిమా సెప్టెంబర్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.