
హైదరాబాద్: ఎక్స్ జ్ పోలీసులంటే గంజాయి ముఠాలకు భయం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. అబ్కారీ సిబ్బంది వద్ద ఆయుధాలుంటేనే స్మగ్లర్లకు భయం ఉంటుందని అన్నారు. నిజామాబాద్ లో గంజాయి ముఠా చేతిలో గాయపడిన కానిస్టేబుల్ సౌమ్య నిమ్స్ ఆస్పత్రి లో చికిత్స తీసుకుంటున్న సౌమ్యను కవిత పరామర్శించి.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆబ్కారీ, అటవీశాఖ సిబ్బందికి మళ్లీ ఆయుధాలు ఇవ్వాలని, రాష్ట్రంలో నేరగాళ్ల విచ్చల విడితనం పెరిగిపోయిందని కవిత మండిపడ్డారు. ఉద్యమకారులకు ఉద్యమనేతను దూరం చేసిందే మాజీ ఎంపి సంతోష్ రావు అని.. సంతోష్ రావు వల్లే గద్దర్ లాంటి వాళ్లు ప్రగతిభవన్ గేట్ బయట ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం రేవంత్ రెడ్డికి గూఢచారి సంతోష్ రావు అని.. సంతోష్ రావుకు శిక్ష పడుతుందనే నమ్మకం లేదని పేర్కొన్నారు. సిట్ పిలవడం సరే కానీ.. ఏం శిక్షలు పడతాయో చూడాలని కవిత అన్నారు.