Reading Time: < 1 minute

  రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో స్టార్ హీరోలతో ఓ ట్రావెల్ బేస్డ్ అడ్వెంచరస్ టాక్ షో ప్రారంభం కానుంది. అదే ‘సోల్ ట్రిప్’. ఈ అడ్వెంచరస్ టాక్ షో మన టాలీవుడ్ స్టార్ హీరోలతో ప్రేక్షకులను అలరించనుంది. ఇది వరకు పోస్టర్, అన్వేషి వంటి సినిమాలు చేసిన హీరో, నిర్మాత విజయ్ దాట్ల తన సొంత బ్యానర్ గండభేరుండ ఆర్ట్‌పై ఈ సెలబ్రిటీ టాక్‌షో సీజన్1ను ముగించుకుని, త్వరలోనే ప్రముఖ ఓటీటీ ఛానల్‌లో రిలీజ్ చేయబోతున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘సోల్ ట్రిప్’ టాక్ షో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మొదటి సీజన్‌లో జగపతిబాబు, శ్రీకాంత్, స్టార్ కమెడియన్ అలీ, హీరోయిన్లు శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వర్ష బొల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.